దీపాల కాంతులతో మెరిసిపోతున్న శివాని రాజశేఖర్.. వైరల్ అవుతున్న పిక్స్?

ఎప్పటికప్పుడు హీరోయిన్లు అందంగా కనిపించడానికి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.తమ అందాలతో తమ అభిమానులను తృప్తి పరచటానికి తెగ తాపత్రయం పడుతూ ఉంటారు.

అలా ఎప్పటికప్పుడు తమకు తోచిన విధంగా ఫోటోషూట్లు చేయించుకుంటూ తమ ఫాలోవర్స్ ను మెప్పిస్తూ ఉంటారు.ఒకప్పుడు తమ అందాలను తమ అభిమానులకు చూపించడానికి ఎటువంటి వేదికలు లేకపోయాయి.

కానీ ఇప్పుడు అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమ అందాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటున్నారు.అయితే తాజాగా శివాని రాజశేఖర్ కూడా తన అందాలతో కుర్రాళ్ళని మెప్పించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ శివాని రాజశేఖర్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.పైగా ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్, జీవితల పెద్దకూతురు కాబట్టి ఈమె తన పరిచయాన్ని ఎప్పుడో పెంచుకుంది.

Advertisement

ఇక చిన్న కూతురు శివాత్మిక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ పరిచయమైన సంగతి తెలిసిందే.ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.

ఇక శివాని రాజశేఖర్ నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది ఈ బ్యూటీ.

శివాని తొలిసారిగా 2018లో 2 స్టేట్స్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అదే ఏడాది వివి స్టూడియోస్ అనే తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది.

ఇక ఆ సినిమాలతో తనకు మంచి సక్సెస్ రావటంతో ఆ తర్వాత అద్భుతం, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది.గత ఏడాది శేఖర్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చాలా వరకు తను నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది శివాని.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

అంతేకాకుండా ఓటీటీ వేదికగా కూడా పలు సిరీస్ లు చేసింది.ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ బ్యూటీ తన తండ్రి లాగా పేరు తెచ్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తుంది.ప్రస్తుతం మంచి సక్సెస్ కోసం బాగా ఎదురుచూస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తనకు ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

తనకు సంబంధించిన ఫోటోలను, సినిమా అప్డేట్లను తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలను కూడా పంచుతూ షాక్ ఇస్తుంది.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏమాత్రం ఇబ్బంది పడకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన అందాలతోకుర్రాలను ఫిదా చేసింది ఈ బ్యూటీ.అందంగా చీర కట్టుకొని దీపాల కాంతుల వెలుగుతో మెరిసిపోతూ తన అందంతో కట్టిపడేసింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు చూసిన తన అభిమానులు తన అందానికి మరోసారి పడిపోయారు.

తాజా వార్తలు