గబ్బర్ సింగ్ ను మించిపోయేలా 'ఉస్తాద్'.. వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఈయన లైనప్ చూసి ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

 Power Star Pawan Kalyan - Harish Shankar Movie Update, Pawan Kalyan, Harish Shan-TeluguStop.com

ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు చివరి దశకు చేరుకుంది.పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.

అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా త్వరలోనే షూట్ పూర్తి కానున్న నేపథ్యంలో మరి కొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు.

మరి పవర్ స్టార్ లైనప్ లో హరీష్ శంకర్ కూడా ఉన్నారు.ఇప్పటికే వీరి కాంబోలో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా తెరకెక్కింది.వరుస ప్లాపుల్లో ఉన్న సమయంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు ఈ సినిమాతో హిట్ అందించాడు.

Telugu Dabangg, Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Tollywo

హిందీ మూవీ దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మ్యానరిజం, స్టైల్, స్వాగ్ అన్ని కూడా ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కూడా కట్టిపడేశాయి.ఇక ఇదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం విదితమే.

ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Telugu Dabangg, Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Tollywo

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.తమిళ్ మూవీ తేరికి ఇది రీమేక్ అని కన్ఫర్మ్ చేసారు మేకర్స్.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ పాత్రను గబ్బర్ సింగ్ ను మించేలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడని.

డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్, ఫైట్స్ అన్ని అంశాలపై శ్రద్ధ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించడానికి హరీష్ శంకర్ సిద్ధం అయ్యాడని తెలుస్తుంది.చూడాలి గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ సినిమా ఆకట్టు కుంటుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube