టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్.ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు.
అంతేకాకుండా ఈ సినిమాతోనే కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు షణ్ముఖ ప్రశాంత్.ఇందులో సుహాస్ సరసన టీనా శిల్ప రాజ్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్,లహరి ఫిలిమ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే.
ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఫిబ్రవరి 3వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరో సుహాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపాడు.సినిమాలో ఎగ్జైట్ పాయింట్ ఏమిటి అని ప్రశ్నించగా.
సినిమా అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది.మరి ముఖ్యంగా క్లైమాక్స్ కి అందరూ బాగా కనెక్ట్ అవుతారు.
రైటర్ పద్మభూషణ్ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాడు.ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని తెలిపాడు హీరో సుహాస్.
మీరు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏమిటి అని ప్రశ్నించగా.కలర్ ఫోటో సినిమా నా కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్.
ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా మజిలీ.అలా తెరపై చూసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు అని తెలిపారు. డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.చిన్న పాత్రలు చేస్తే చాలు అనుకున్నాను కానీ చాలా మంచి పాత్రలు వస్తున్నాయి.రచయితల వలన చాలా భిన్నమైన పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది.
వచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలి అన్న దానిపైన నా దృష్టి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు సుహాస్.చివరగా రైటర్ పద్మభూషణ్ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెప్పాలి అనుకున్నారు అని అడగగా.
ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు.హెవీ హార్ట్ ఫీలింగ్ తో మంచి చిరునవ్వుతో బయటికి వస్తారు.
మంచి సినిమా చేశారని అభినందిస్తారు ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని తెలిపాడు సుహాస్.