యువగళం : లోకేష్ ' పవర్ ' చూపిస్తారా ?

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘ యువ గళం’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.

 Yuvagalam Will Lokesh Show Power-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు ఏ యాత్ర దాదాపు 400 రోజుల పాటు , నాలుగు వేల కిలోమీటర్లు మేరకు సాగనుంది.ఇక తొలి రోజు పాదయాత్రకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కీలక నాయకులందరినీ ఈ  పాదయాత్ర ప్రారంభ సభకు ఆహ్వానించారు.175 నియోజకవర్గాల ఇన్చార్జీలు ఈ సభకు హాజరయ్యారు.దీంతో పాటు నందమూరి , నారా కుటుంబాలు హాజరయ్యాయి.ఒకరకంగా లోకేష్ పాదయాత్ర కంటే ముందుగానే భారీగా హైప్ వచ్చింది.మీడియా సోషల్ మీడియాలోనూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.గతంలో పాదయాత్ర నిర్వహించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,జగన్ చంద్రబాబు వంటి వారు సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు అదే బాటలో లోకేష్ కూడా పాదయాత్రతో సక్సెస్ అవ్వాలని,  టిడిపిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నారు.గతంతో పోలిస్తే లోకేష్ పనితీరుతో పాటు , ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మారింది.

Telugu Chandrababu, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politics

 పార్టీపై పట్టు సాధించడంలో సక్సెస్ అయ్యారు.ఇక ఈ పాదయాత్ర ముగిసేనాటికి పూర్తిగా జనాల్లోనూ తన ఆదరణ పెంచుకుని టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు వెళ్లబోతున్నారు.గతంలో లోకేష్ పని తీరుపై సొంత పార్టీ నాయకులు బహిరంగంగా అనేక విమర్శలు చేసేవారు.లోకేష్ పార్టీకి భారం అని , ఆయన ఆధ్వర్యంలో టిడిపి ముందుకు వెళ్లడం కష్టమని రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి.

చంద్రబాబు వయసు రీత్యా చూసుకున్నా,  ముందు ముందు ఆయన యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించకపోవడంతో,  లోకేష్ పైనే టిడిపి భారం పడనుంది అయితే ఇప్పుడు పాదయాత్ర ద్వారా పార్టీలోను ప్రజలను పట్టు సాధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను ఎంచుకున్నారు.ఇక ఈ పాదయాత్ర ముగిసి,  2024 ఎన్నికల్లో టిడిపి కనుక అధికారంలోకి వస్తే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ ఖాతాలోనే పడనుంది .

Telugu Chandrababu, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politics

 ఇక జనసేన పార్టీతో పొత్తు కూడా కుదిరే అవకాశం ఉండడంతో , గెలుపు పై ధీమా ఉంది.గెలిచిన తర్వాత తన వల్లే టిడిపి గెలిచిందని పవన్ వ్యాఖ్యానించేందుకు అవకాశం లేకుండా లోకేష్ కే ఆ క్రెడిట్ దక్కేలా చంద్రబాబు ముందస్తుగానే వ్యూహ రచన చేసినట్టు అర్థమవుతుంది .2014 ఎన్నికల్లో టిడిపికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు.ఆ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో తనవల్లే టిడిపి గెలిచిందని,  అనవసరంగా మద్దతు ఇచ్చి టిడిపిని గెలిపించానని అనేక సందర్భాల్లో పవన్ వ్యాఖ్యానించడం వంటివి,  టిడిపికి అప్పట్లో ఇబ్బందికరంగా మారాయి.

ముందు ముందు అటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా లోకేష్ పాదయాత్ర టిడిపికి ఉపయోగపడబోతోంది.ఇక లోకేష్ కూడా .ఈ పాదయాత్ర ద్వారా తాను అన్ని రకాలుగానూ సమర్ధుడైన నేతగా నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube