కర్నూలు జిల్లా జాలవాడి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.మద్యం తాగద్దని చెప్పినందుకు భార్యను, అత్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త నాగరాజు.
అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తుండగా వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు.దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారని తెలుస్తోంది.
ఘటన అనంతరం నిందితుడు నాగరాజు పరారైయ్యాడు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.