వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రను పున: ప్రారంభించనున్నట్లు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి లభించింది.
ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి సీపీ అనుమతినిస్తున్నట్లు వెల్లడించారు.ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే యాత్ర నిర్వహించుకోవాలన్నారు.
పార్టీలు, కులాలు, మతాలను ఉద్దేశించి గానీ, వ్యక్తిగతంగా గానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.కాగా గతంలో వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా వద్ద పాదయాత్ర ఆగిపోయిన విషయం తెలిసిందే.
అయితే షర్మిల యాత్ర.శంకరమ్మ తండా గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవురుప్పల, పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు సాగనుందని సమాచారం.