బిగ్ బాస్ సీజన్-5లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్.తెలుగు బుల్లితెరపై ఈ షో సందడి ఓ రేంజిలో ఉంటుంది.

టాప్ రేటింగ్స్ తో దుమ్మురేపుతుంది.జనాల నుంచి ఈ షోకు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు.

అయితే నాలుగో సీజన్ కంప్లీట్ అయి చాలా రోజులైనా.ఐదో సీజన్ పై ఫుల్ క్లారిటీ రాలేదు.

వాస్తవానికి ఐదో సీజన్ ఎప్పుడో జరగాల్సి ఉన్నా.కరోనా లాక్ డౌన్ మూలంగా వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement
Shanmukh Jaswanth Highest Remuneration For Bigg Boss Telugu 5 , Shanmukh Jaswant

కొద్ది రోజుల క్రితం ఐదో సీజన్ కు సంబంధించిన లోగో కూడా రిలీజ్ అయ్యింది.జనాలు ఈ లోగోను చూసి వారెవ్వా అంటున్నారు.

మరోవైపు ఈ షో ఎప్పుడు మొదలవుతుందా? అని జనాలు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు షో సెప్టెంబర్ రెండో వారం నుంచి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇది కన్ఫామ్ డేటా? కాదా? అనే విషయం త్వరలో తేలనుంది.అటు ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో ప్రధానంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సినీ స్టార్స్ ఇషా చావ్లా, సురేఖా వాణి, యాంకర్ వర్షిణి సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.వీరిలో పలువురికి పలు రకాల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఒక్కొక్కరికి ఉన్న పాపులారిటీని బట్టి వారికి రేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.తాజా సీజన్ షోలో షణ్ముఖ్ జస్వంత్ కు ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

పారితోషికం ఎక్కువ ఇస్తేనే షోకు వస్తానని ఆయన కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే విషయంపై కొద్దిరోజులు సస్పెన్స్ కొనసాగినట్లు తెలుస్తోంది.

చివరకు షో నిర్వాహకులు ఓకే చెప్పడంతో తను షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పిట్లు టాక్.

తాజాగా సీజన్ కు హోస్ట్ గా పలువురు పేర్లు వినిపించినా.చిరవకు నాగార్జున ఫిక్స్ అయ్యాడు.ఇటీవలే బిగ్ బాస్ 5 సీజన్ కు సంబంధించి ప్రోమో షూట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ప్రోమో టీజర్ ను తెరకెక్కించాడట.అటు నాలుగో సీజన్ విన్నర్ గా అభిజీత్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు