పాలవరం తండాలో నీటి కటకట అమలుకాని కలెక్టర్ ఆదేశాలు...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఎండాకాలం నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు అధికారులకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో సంబంధింత అధికారులు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ప్రజల నీటి కష్టాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీకి చెందిన మండల యూత్ నాయకుడు బోస్ అవేదన వ్యక్తం చేశారు.

శనివారం ఆయన మాట్లాడుతూ అనంతగిరి మండల పరిధిలోని పాలవరం తండా గ్రామంలో మూడు రోజుల నుంచి నీళ్లు రాక, వేసవి కాలంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని, అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ప్రజల నీటి కటకటను గాలికి వదిలేశారన్నారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామపంచాయతీ పాలక మండలి వారు కూడా వాటర్ ట్యాంక్ తో నీళ్లు సరఫరా చేయడం లేదని,అటు గ్రామ పంచాయతీ నీళ్ళు లేక,ఇటు మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారని,మూడు రోజుల నుంచి నీళ్లు లేక మనుషులతో పాటు పశువులు కూడా కష్టాలు పడుతున్నాయని,మండే ఎండలకు ఒక రోజు నీళ్లు లేకుంటేనే అల్లాడిపోతున్న నేపథ్యంలో మూడు రోజులు గ్రామంలో నీళ్లు లేకుండా ఎలా బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.నీటి సమస్యను తీర్చకుండా గ్రామాలకు అధికారులు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..
Advertisement

Latest Suryapet News