జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( \Pawan kalyan, ) రాజకీయాల్లో ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థంకానీ పరిస్థితి.ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న వేళ సడన్ గా పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చి సినిమాలవైపు మొగ్గు చూపుతారు.
మళ్ళీ సైలెంట్ గా ఉన్న ఏపీ రాజకీయాల్లో సడన్ గా ఎంట్రీ ఇచ్చి తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటారు.దీంతో పవన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థం కాక ప్రత్యర్థి పార్టీ నేతలు తలలు పట్టుకుంటూ ఉంటారు.
ఇక ఎప్పటి నుంచో పవన్ ప్రచారంపై తీవ్ర చర్చ జరుగుతోంది.పవన్ బస్సు యాత్ర కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించి దానికి వారాహి అని పేరు పెట్టారు.

వారాహి ( Varahi )ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించి రాష్ట్ర నలువైపులా జనసేన పేరు మారుమ్రోగేలా ప్రణాళికలు రచించారు.దీంతో పవన్ వారాహి ఎప్పుడు బయటకు వస్తుందా అని జనసైనికులతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.అయితే గత ఏడాది ప్రారంభం కావల్సిన వారాహి యాత్ర అనూహ్యంగా హోల్డ్ చేశారు పవన్.దానికి సంబంధించి స్పష్టమైన కారణాలు బయటకు రానప్పటికి లోకేశ్ పాదయాత్ర కోసమే పవన్ బస్సు యాత్రను పోస్ట్ పోన్ చేశారనే వాదన గట్టిగా వినిపించింది.
ఇక అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ వారాహి యాత్రపై వార్తలు వినిపిస్తున్నప్పటికి జనసేనాని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇక తాజాగా పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్( Nadendla manohar ) వారాహి ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ ఇచ్చారు.ఈ నెల 16 నుంచి వారాహి పై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.మొదటగా ఉబయగోదావరి జిల్లాలో పవన్ ప్రచారం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో నియోజిక వర్గంలో రెండు రోజులు ప్రచారం చేసే విధంగా పవన్ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది.ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు జనసేన హామీలను కూడా ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే ” ఒక్క ఛాన్స్ ” అంటూ నినాదిస్తున్న పవన్.ఇదే నినాదాన్ని వారాహి యాత్రలో బలంగా వినిపించే అవకాశం ఉంది.
మరి పవన్ కు “వారాహి యాత్ర ” ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.







