మా నాన్న ఇలా అవ్వడానికి కారణం అంటూ.. రాకేష్ మాస్టర్ కొడుకు సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ సీనియర్ డాన్సర్ రాకేష్ మాస్టర్ మరణించడం తెలిసిందే.

దాదాపు 1500 చిత్రాలకు పైగా పనిచేసిన ఆయన మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామందిని కలచివేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ లుగా చలామణి అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు ఇద్దరు కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే.చిత్ర పరిశ్రమలో ప్రభాస్, మహేష్ బాబు హీరోల సినిమాల పాటలకి  కొరియోగ్రాఫర్ చేసిన రాకేష్ మాస్టర్ మరణం చాలామందిని కలచివేసింది.

అయితే చివరి దినాలలో మద్యానికి బాగా బానిస అయిపోయి ఉన్నట్టుండి హఠాత్తుగా మరణించడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది.

Sensational Comments By Choreographer Rakesh Masters Son Tollywood, Choreograph

ఇటువంటి తరుణంలో రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తండ్రి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తన తండ్రి చివరి దినాలలో దుర్బర స్థితికి చేరుకోవటానికి ప్రధాన కారణం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అని అసహనం వ్యక్తం చేశారు."మా నాన్న ఇలా అవటానికి సోషల్ మీడియానే కారణం.

Advertisement
Sensational Comments By Choreographer Rakesh Master's Son Tollywood, Choreograph

కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లబ్ధి పొందేందుకు ఆయనను ఉపయోగించుకుని తర్వాత నెగిటివ్ గా చూపించాయి.ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి.

ఫ్యామిలీ విషయాలను ప్రసారం చేయకండి.ఇప్పటివరకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలు అంటూ.

రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ విజ్ఞప్తి చేశారు.

ఇదేందయ్యా ఇది : చితికి మంటపెట్టగానే చనిపోయిన వ్యక్తి ఇలా చేశాడేంటి?
Advertisement

తాజా వార్తలు