ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆవును చూస్తే.. నక్కతోక తొక్కినట్టే!

మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లిని చూస్తే మంచిది కాదంటారు.అందులోనూ నల్ల పిల్ల అయితే అపశకునం అంటారు.

తుమ్మినా, కట్టెలు ఎదురుగా వచ్చినా కాసేపు ఆగి ప్రయాణాన్ని కొనసాగిస్తారు.మరి ఆవును చూస్తే ఏం జరుగుతుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా.! ఆవును చూస్తే చాలా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

గరుడ పురాణం ప్రకారం.ఒక రోజులో గోవు, గోమూత్రం, పంట పొలం, గోధూళి కనిపించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

ఆవుహిందూ మత విశ్వాసాలలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.రోజులో ఏ సమయంలో గోమాత కనిపించినా దాన్ని శుభప్రదంగా భావిస్తారు.

Advertisement
Seeing A Cow When Going Anywhere Is Going To Be Very Good, Cow Devotional , Luc

అలా కనిపించినప్పుడు మనసులో నమస్కరించుకుంటే శుభం కలుగుతుంది.గోమాత దర్శనం ద్వారా మీకు ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుంది.

గోమూత్రంహిందూ మతంలో గోమూత్రాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.పూజా క్రతువులు, ఇతర శుభకార్యాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

కాబట్టి గోమూత్రాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు.గోమూత్రం సేవించడం కూడా మంచిదని భావిస్తారు.

ఆయుర్వేదంలో అనేక రకాల మందుల తయారీలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు.

Seeing A Cow When Going Anywhere Is Going To Be Very Good, Cow Devotional , Luc
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

పంట పొలం

Seeing A Cow When Going Anywhere Is Going To Be Very Good, Cow Devotional , Luc
Advertisement

గరుడ పురాణం ప్రకారం.మనం వెళ్లే దారిలో పంట పొలాన్ని చూడటం శుభ సంకేతం.ఆ పంట అప్పటికే పండిన దైతే.

అది మరింత శుభప్రదం.పండిన పంటలతో నిండిన పొలాన్ని చూస్తే మనిషికి పుణ్యంతో పాటు మంచి జరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది.

గోధూళిగోమూత్రమే కాదు గోధూళిని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.గోవుల మంద వెళ్లేటప్పుడు నేల నుంచి ఎగిసే దుమ్ము పవిత్రమైనదిగా చెబుతారు.

కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదమైనదిగా భావిస్తారు.గోవు, గోమూత్రం, గోధూళి, పంట పొలం.

ఒకరోజులో ఈ నాలుగింటిని చూసినట్లయితే ఆ వ్యక్తులకు శుభం కలుగుతుంది.వారికి ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుందని నమ్ముతారు.

తాజా వార్తలు