గాలిలో వేలాడే స్తంభం గురించి మీకు తెలుసా?

మన భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు వంటిది.ఎన్నో చిత్ర విచిత్రాలు, వింతలు మన భారతదేశంలో చూడవచ్చు.

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి.అలా పర్యాటకులకు ప్రసిద్ధి చెందినదే లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం.

History Of Hanging Pillar In Lepakshi ,secret, Hanging Pillar, Veerabhadra Templ

ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత మనం వీరభద్ర స్వామి దేవాలయంలో చూడవచ్చు.ఈ దేవాలయంలో ఎన్నో స్తంభాలతో నిర్మించబడినది.

అయితే ఇందులో ఉన్నటువంటి ఒక స్తంభం నేలను తాకకుండా గాలిలో తేలాడుతూ ఆ ఆలయానికి ఒక ప్రత్యేకగా నిలిచింది.మరి ఆ స్తంభం వెనుక ఉన్న రహస్యాలను ఛేదించడానికి ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఫలితం దక్కలేదు.అయితే ఆ ఆలయ చరిత్ర, ఆ స్తంభం యొక్క చరిత్ర ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి వీరభద్ర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు.ఇది కుర్మా శైల( తాబేలు ఆకారపు శిలా) అనే కొండపై ఉంది.

Advertisement

ఈ పురాతన ఆలయంలో ప్రతి స్థంభం పై శిలా శాసనాలు ఉంటాయి.వీరభద్రస్వామి ఆలయం బయట నాట్య మండలి లో పైకప్పుకు మద్దతుగా 70 స్తంభాల తో నిర్మించబడి ఉంది.

సాధారణంగా స్తంభాలు నేలను తాకుతూ పైకప్పుకు ఆధారంగా ఉంటాయి.కానీ ఈ దేవాలయంలో ఉన్న ఒక స్తంభం నేలకు కొద్దిగా ఎత్తులో పైకప్పును తాకుతూ గాలిలో వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంది.

దీనితో అబ్బురపడిన బ్రిటీష్ ఇంజనీర్ హామిల్టన్ 1910వ సంవత్సరంలో ఈ నిర్మాణ ఉల్లంఘనకు సరిదిద్దడానికి ప్రయత్నించాడు.ఇంకేమైనా మార్పునకు ప్రయత్నిస్తే ఈ భవనం మొత్తం నాశనం అవుతుందని ఆ ఇంజనీర్ గ్రహించాడు.

ఈ ఒక్క స్తంభం పైకప్పుకు ఎంతో బ్యాలెన్స్ చేస్తుందని, అందువల్ల ఒక చిన్న మార్పు జరిగిన ఈ భవనం మొత్తం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ పరిశోధనను అంతటితో ఆపారు.అప్పటినుంచి ఆ స్తంభం వెనుక రహస్యం ఎవరు చేధించలేక పోయారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

లేపాక్షి యొక్క మూలానికి రెండు ఆసక్తికరమైన పురాణాలు ఉన్నాయి.ఈ కథ రామాయణం పురాణం నుండి ఉద్భవించినది.

Advertisement

రావణుడు అపహరణ ప్రయత్నం నుండి సీతను కాపాడటానికి ప్రయత్నించినప్పుడు జాతకుడు రావణుడితో తీవ్రంగా పోరాటం చేశాడని చెప్పబడుతుంది.కానీ అతడు రావణుడి శక్తిని తట్టుకోలేకపోయాడు.

తన రెక్కలు కోల్పోయాక భూమిపై పడిపోయాడు.జాతాయు రెండు రెక్కలు ఇక్కడ రాళ్లపై పడ్డాయని నమ్ముతారు.

రాముడు ఆ పక్షిని లేవమని ఆజ్ఞాపించినప్పుడు(లే పక్షి), అనడం వల్ల ఈ ప్రాంతానికి లేపాక్షి అన్న పేరు వచ్చింది.అంతేకాక లేపాక్షిలోని ఒక రాతి వద్ద రాముడి పాద ముద్రలను మనం చూడవచ్చు.

తాజా వార్తలు