కాకి తన్నితే ఏమువుతుందో తెలుసా..?

మన దేశం ఎన్నో సంప్ర‌దాయాల‌కు మరెన్నో న‌మ్మ‌కాల‌కు నెల‌వు.అయితే ప్రజలు కొన్నింటిని ఎక్కువగా నమ్ముతుంటారు.

 Scientific Reason Among While Crow Scrath The People, Scientific Reason , Crow ,-TeluguStop.com

అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలున్నాయి.

వాటిలో కాకి శకునం ఒకటి.కాకి త‌న్నితే అప‌శ‌కునం మ‌నే మూఢ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో బలంగా నాటుకుపోయింది.

కాకి త‌ల‌పై త‌న్నితే మ‌ర‌ణ వార్త వింటార‌ని.ఏడేళ్ల పాటు శని తాండ‌విస్తుంద‌ని పెద్దలు చెబుతుంటారు.

అయితే దీని వెన‌క కూడా శాస్త్రీయ‌త ఉంద‌ని మీకు తెలుసా.? ఇంత‌కీ కాకి త‌ల‌పై త‌న్నితే సైన్స్ ప్ర‌కారం ఏమ‌వుతుందో తెలుసా.

కాకి గోళ్లు చాలా ప‌దునుగా ఉంటాయి.కాబ‌ట్టి వేగంగా ఎగురుతూ వ‌చ్చి త‌ల‌పై త‌న్నితే గోళ్లు గుచ్చుకునే ప్ర‌మాదం ఉంటుంది.అయితే కాకులు స‌హ‌జంగా ఆహార అన్వేష‌ణ‌లో భాగంగా ఎలుక‌ల‌ను, చ‌నిపోయిన జంతువుల‌ను కాలి గోళ్ల‌తో పీక్కుతింటాయి.దీనివ‌ల్ల కుళ్లి పోయిన జంతువుల వ్య‌ర్థాలు కాకి కాలి గోళ్ల‌లో ఉండిపోతాయి.

ఈ క్ర‌మంలో త‌ల‌పై త‌న్నిన స‌మ‌యంలో కుళ్లిపోయిన వ్య‌ర్థాల్లో ఉండే క్రిములు మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది.అయితే పూర్వం రోజుల్లో స‌రైన వైద్య స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్ర‌వేశించ‌డంతో మ‌ర‌ణాల‌కు దారి తీసేది.

దీంతో కాకి త‌న్నితే మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉండిపోయింది.

అంతే కాకుండా కాకి త‌ల‌పై త‌న్నితే త‌ల స్నానం చేయాల‌ని చెబుతుంటారు.దీనివ‌ల్ల త‌ల‌పై ఏమైనా క్రిములు చేరితో తొలిగిపోతాయ‌ని చెబుతుంటారు.కాబ‌ట్టి కాకి త‌న్నితే అప‌శ‌కునంలాగా భావించ‌కుండా శాస్త్రీయంగా ఆలోచించి.

ఏదైనా గాయ‌మైతే చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం.

Scientific Reason Among While Crow Scrath The People, Scientific Reason , Crow , Crow Scrath , Tradirions, - Telugu Crow, Crow Touches, Devotional

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube