మొత్తానికి తండ్రిని ' మరిపిస్తున్న ' జగన్ ?

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా జగన్ నామస్మరణ మారుమోగుతోంది.జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు, చాల పథకాలకు జగన్ పేరు వాడేస్తూ ఉండడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

 Ys Jagan  Houses To Poor People, Ys Jagan, Poor People Houses, Jagan Schemes, Ys-TeluguStop.com

వైసిపిని స్థాపించిన దగ్గర నుంచి చూసుకుంటే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పూర్తిగా వైయస్ రాజశేఖర రెడ్డి పేరును అందరూ ప్రస్తావించేవారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా, పదే పదే వైస్ రాజశేఖరరెడ్డి ని గుర్తుచేస్తూ పాదయాత్ర నిర్వహించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలకు ఆయన పేరును పెట్టేవారు.అయితే రాను రాను ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ముఖ్యమైన పథకాలకు జగన్ పేరే కనిపిస్తోంది.


రాబోయే ఎన్నికల నాటికి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం పెద్దగా ఉండదని, పూర్తిగా జగన్ పేరును జనాలకు చేరువ అయ్యేలా చేస్తేనే ఉపయోగం ఉంటుందనే అభిప్రాయంతో కొంతమంది నాయకులు, అధికారులు చేసిన సూచనకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి చుకుంటే రాజశేఖర్రెడ్డి ప్రభావం పార్టీలో తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.ప్రస్తుతం పేదలకు ఇస్తున్న ఇళ్లకు వైస్సార్ ఇళ్లు అని పేరు పెట్టాలని భావించినా, అది సెంటిమెంట్ కు సంబంధించిన వ్యవహారం కావడంతో జగన్ పేరునే పెట్టారట.


Telugu Ap Cm Jagan, Jagan, Jagan Schemes, Poor Houses, Ys Jagan, Ysjagan, Ysraja

ఇక ముందు ముందు జగన్ నామస్మరణ చేసి, రాబోయే ఎన్నికల్లోనూ తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాధాన్యం వైసీపీలో తగ్గుతోందా అనే అభిప్రాయం వైఎస్ అభిమానుల్లో కలుగుతోంది.గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే పేద, బడుగు బలహీన వర్గాల లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారో అదే విధంగా జగన్ కూడా తన పేరు పదే పదే గుర్తు చేస్తూ, తాను ఆ స్థాయి వ్యక్తి గా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube