జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు పేరుతో రాజకీయాల వైపు పెద్దగా దృష్టి సారించకపోయినా, వ్యూహాత్మకంగానే ఇప్పుడు వ్యవహరిస్తున్నారు.ప్రధాన సమస్యలపై పోరాడేందుకు నిర్ణయించుకొన్నారు.
ఒక్కో సమస్యను హైలెట్ చేస్తూ ఇటు జనసేన పార్టీకి జనాల్లో పెరిగేలా చేసుకోవడంతోపాటు, వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా, నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పైన జనసేన దృష్టిసారించింది.ఆ సమస్యలను మీడియా, సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెస్తూ, వైసిపి ప్రభుత్వ పరిపాలన ఘోరంగా ఉందని ,ప్రభుత్వం ప్రకటన వరకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేస్తోంది తప్ప, క్షేత్రస్థాయిలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదనే విషయాన్ని హైలెట్ చేయడంలో జనసేన ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతుంది.
తాజాగా ఏపీలో ప్రధాన సమస్యగా ఉన్న రోడ్ల సమస్య పై జనసేన గళం ఎత్తింది.మూడు రోజులు ప్రణాళికను రూపొందించుకుని మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పెద్ద ఎత్తున జన సైనికులు ఏపీ వ్యాప్తంగా ఉన్న రోడ్లను ఫోటోలు, వీడియోలు తీస్తూ వాటిని జేఎస్పి ఫర్ ఏపీ రోడ్స్ అనే యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేస్తూ ఉండడం వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జనసైనికులు పల్లె నుంచి పట్నం వరకు ఉన్న రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతున్నారు.మరికొన్ని చోట్ల సొంతంగా జన సైనికులే రోడ్ల మరమ్మతులను చేయిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న రోడ్లు, అధ్వాన్న ఫోటోలు వైసీపీ ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి.ప్రస్తుతం జనసేన రోడ్ల ఉద్యమం పై ప్రజలలోను సానుకూలత వ్యక్తం అవుతోంది.

ఈ తరహా పోరాటాలు, ప్రజా సమస్యల విషయంలో జనసేన దృష్టి పెడుతూ ముందుకు వెళ్తే , రాబోయే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పార్టీగా జనసేన మారడంతో పాటు అధికారానికి చేరువయ్యేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి.ఈ తరహా ఉద్యమాల్లో పవన్ సైతం అప్పుడప్పుడు పాల్గొంటే జనసైనికులు మరింత ఉత్సాహంతో జనసేన ను జనాల్లోకి తీసుకెళ్లడంలో మరింత ఆసక్తి చూపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఈ తరహా కార్యక్రమాలు తరచుగా చేయడంవల్ల ప్రజలలోను పార్టీకి మంచి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.