మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో కీలక నిందితుడు దస్తగిరి( Dastagiri ) అందరికీ సుపరిచితుడే.ఈ క్రమంలో త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ పై దస్తగిరి పోటీకి దిగుతున్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి “జై భీమ్”( Jai Bheem ) పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.ఈ క్రమంలో విజయవాడలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కండువా కప్పి దస్తగిరిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు దస్తగిరి ప్రకటించారు.
ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితమే తెలియజేయడం జరిగింది.ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన దస్తగిరి ఇటీవల నాంపల్లి కోర్టులో హాజరయ్యారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్( CM Jagan ) పై పులివెందులలో పోటీకి దిగిబోతున్నట్లు.
దస్తగిరి వెల్లడించడం జరిగింది.కాగా ఇప్పుడు “జై భీమ్” పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
ఈ సందర్భంగా పులివెందుల నుండి జై భీమ్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్లు దస్తగిరి వెల్లడించారు.ఏపీలో జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో పులివెందుల సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ నుండి బీటెక్ రవికి సీటు కన్ఫామ్ చేయడం జరిగింది.