అనుష్క వద్దకు మరో దర్శకుడు.. అదే పాట..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు అందుకుంది.

తన అందంతో ఎంతోమంది హృదయాలను తాకింది.ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలకు కాస్త దూరం అయ్యింది.

ఒకప్పుడు ఒక సంవత్సరానికి ఎన్నో సినిమాల్లో నటించే ఈ బ్యూటీ.ప్రస్తుతం అవకాశాలు రావట్లేవని చెప్పవచ్చు.

ఇటీవలే నిశ్శబ్దం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కానీ ఆ సినిమా అనుష్కకు అంత సక్సెస్ ని ఇవ్వలేదు.

Advertisement

ఇక అప్పటి నుంచి ఎటువంటి అవకాశాలు అందుకోకపోగా.తాజాగా అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది.

నిజానికి ఇప్పటికే అనుష్క ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని ప్రస్తుతం కరోనా వైరస్ కారణం వల్ల వాయిదా పడిందని తెలిసింది.

రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా చేయనుందని వార్తలు వినిపించాయి.ఫన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ అనుష్కకు నచ్చడంతో.ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

అంతేకాకుండా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నట్లు, ఇందులో హీరో వయసు హీరోయిన్ కంటే తక్కువగా ఉండటంతో.వారిద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీ ని తెరకెక్కించాలనుకున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇదిలా ఉంటే అనుష్క గురించి మరికొంత మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారని సమాచారం అందగా.తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్ అనుష్కను కలిసి వెబ్ సిరీస్ కోసం ఓ కథను వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

అంతే కాకుండా అనుష్క కూడా ఓకే చెప్పగా.ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొననని చెప్పిందట.

ఇక ఈ సినిమా గురించి అనుష్క త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.

తాజా వార్తలు