చాలామంది భారతీయ విద్యార్థులు అమెరికా( America )కు వెళ్లి చదువుకుని అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు.అక్కడికి వెళ్లి తమ కలను నిజం కూడా చేసుకుంటారు.
అయితే ఇటీవల కాలంలో అమెరికాకి వెళ్లి చదువుకోవడం చాలా అసాధ్యంగా మారింది.వీసాలు త్వరగా జారీ కావడం లేదు.
వ్యాలీడ్ వీసాలు పొందినా అక్కడి అధికారులు తిరిగి పంపిస్తున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వ్యాలీడ్ వీసాలు గల 21 మంది భారతీయ విద్యార్థులను( Indian Students ) యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు.

వారు అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో యూనివర్సిటీలలో చేరిన విద్యార్థులు అని తెలుస్తోంది.వారందరినీ దేశంలో ల్యాండ్ అయిన వెంటనే యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు( US Immigration Officers ) ఎయిర్ ఇండియా విమానంలో భారతదేశానికి తిరిగి పంపించారు.యునైటెడ్ స్టేట్స్‌లో ఐదేళ్లపాటు ప్రవేశించకుండా ఒక బ్యాన్ కూడా విధించారు.
ఈ నివేదికలు భారతీయ విద్యార్థులు, వారి కుటుంబాలలో ఆందోళన కలిగించాయి, అలాగే U.S.ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ తీరుపై ఆగ్రహాలు వెల్లువెత్తాయి.అమెరికాలో సీటు వచ్చిందని చాలామంది అప్పులు చేసి మరీ పిల్లలను అక్కడికి పంపిస్తున్నారు.కానీ తీరా అధికారులు వెనక్కి పంపిస్తుండటంతో వారు తల్లడిల్లి పోతున్నారు.ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, అమెరికా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని భారత ప్రభుత్వం( Indian Government ) హామీ ఇచ్చినట్లు సమాచారం.డాక్యుమెంట్స్ లోపం కారణంగా విద్యార్థులను బహిష్కరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ఈ నివేదికలను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

రీసెంట్‌గా అమెరికన్ అధికారులు పంపించిన 21 మంది భారతీయ విద్యార్థులలో తెలుగు స్టేట్స్ నుంచి కూడా కొందరు ఉన్నట్లు సమాచారం.డైలీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 5,000 నుంచి 6,000 మంది విద్యార్థుల వరకు అమెరికాకి వెళ్తున్నారు దీన్నిబట్టి తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు అమెరికా చదువుపై ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు.







