బాపట్ల జిల్లాలో స్కూల్ బస్ బోల్తా.. విద్యార్థులకు గాయాలు

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలో కూచిపూడి, పెద్దపూడి గ్రామాల మధ్య అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.కాగా ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ముగించుకుని తిరిగి వెళ్తుండగా అదుపుతప్పిన బస్ పంట కాలువలో తిరగబడిందని స్థానికులు చెబుతున్నారు.వెంటనే గమనించిన సమీప గ్రామస్థులు బాధిత విద్యార్థులను హుటాహుటిన తెనాలిలో ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు