గణపవరం ఊర చెరువును కాపాడండి

సూర్యాపేట జిల్లా:గ్రామానికి జల వనరులను మరియు మత్స్యకారులకుజీవనోపాధిని ఇస్తున్న చెరువును కొందరు అక్రమార్కులు అక్రమంగా చెరబడుతున్నారని ఆరోపిస్తూ ఆక్రమణకు గురవుతున్న చెరువును కాపాడలంటూ మత్స్యకారులు చెరువు వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం( Ganapavaram )లో వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు ( Fishermen )మాట్లడుతూ గణపవరం గ్రామంలోని ఊర చెరువు వందల ఏళ్ల నుండి గ్రామానికి జల వనరులను అందిస్తూ, చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా ఉందన్నారు.

గత కొద్ది రోజులుగా గ్రామానికి చెందిన కొందరు ఆక్రమణదారులు చెరువును కబ్జా పెట్టే పనిలో ఉన్నారని,ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.దీనితో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి,తమకు ఎదురు చెప్పేవారు లేరని చెరువును పూర్తిగా పూడ్చడం మొదలు పెట్టారని,చేసేదేమీ లేక ఊర చెరువును కాపాడుకోడానికి ఆందోళన చేపట్టామని తెలిపారు.

చెరువు మొత్తం ఆక్రమణలకు గురైతే తాము జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఊర చెరువును కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని, చెరువును ఆక్రమించిన అక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రామచంద్రాపురం మొర్సకుంట చెరువు వద్ద గ్రామస్తుల ఆందోళన
Advertisement

Latest Suryapet News