సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్.. మహేష్ పాచికకు పాతిక పక్కా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంక్రాంతి బరిలో రాబోయే ఈ సినిమాకోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా అన్ని భాషల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం ఆతృతను ఏర్పాటు చేసింది.ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేషన్ చేస్తుందో బాక్సాఫీస్ జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.

Sarileru Neekevvaru Day One Collections To Be Huge-సరిలేరు నీ

అయితే ఈ సినిమా తొలిరోజే ఎదురులేని విధంగా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా లెక్కలపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా తొలిరోజే ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందా అని వారు తలలు పీక్కుంటున్నారు.కాగా ఈ సినిమాతో మహేష్ తొలిరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.25 కోట్ల మేర బిజినెస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదని, తొలి రోజు రికార్డులపై కన్నేయాల్సిందిగా అభిమానులు అంటున్నారు.

Advertisement

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలకపాత్రలో నటిస్తోంది.మరి తొలిరోజు ఓపెనింగ్స్‌తో ఈ సినిమా సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటుందో లేదో చూడాలి.

3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు