స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛత హి సేవా(Swachhata Hi Seva ) కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమ ఫ్లెక్సీ నీ ఆవిష్కరించారు.

స్వచ్ఛత హి సేవ కార్యక్రమం క్రింద చేపట్టాల్సిన కార్యక్రమం షెడ్యూల్ వివరాలను స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ( District Collector Sandeep Kumar Jha ) మాట్లాడుతూ, 17 సెప్టెంబర్ నుంచి 02 అక్టోబర్ వరకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

Sandeep Kumar Jha, District Collector, Should Carry Out Cleanliness And Seva Pro

స్వచ్చత హి సేవ అంశం పై పాఠశాలలో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ఆర్ట్ పోటీలు నిర్వహించాలని, పారిశుధ్య నిర్వహణ, ప్రాముఖ్యత పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.గ్రామాలలో శ్రమదానం నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, ఆసుపత్రులు, పంచాయతీ భవనాలు మొదలగు ప్రజాసంచార ప్రదేశాలను శుభ్రం చేయాలని, శుక్రవారం డ్రై డే నిర్వహిస్తూ నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు.

గ్రామాలలో త్రాగునీటి సరఫరా నాణ్యతను పరిశీలించాలని, పారిశుధ్యం పై ఇంటింటా ప్రచారం నిర్వహించాలని, రోడ్లపై వేసిన చెత్త తొలగింపు, అవసరమైన కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం, తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాలు, గ్రామ శివారులో చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వాడకం పై అవగాహన కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందికి ఆరోగ్య పరీక్షల నిర్వహణ, గాంధీ జయంతి నాడు గ్రామసభలు ఏర్పాటు చేసి స్వచ్ఛభారత్ దినోత్సవం నిర్వహించి పారిశుధ్య సిబ్బందిని సన్మానించాలని కలెక్టర్ తెలిపారు.నిర్దేశించిన షెడ్యూలు తూచా తప్పకుండా పాటించాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని , స్వచ్చత హి సేవ కార్యక్రమ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, స్వచ్ఛభారత్ మిషన్ అధికారి సురేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News