నెగటివ్ పాత్రలో సమంత..!

మొన్నటిదాకా కేవలం హీరోయిన్స్ పాత్రలే చేస్తూ వచ్చిన సమంత ఇప్పుడు నెగటివ్ రోల్స్ కి సై అనేస్తుంది.

ఆల్రెడీ అమేజాన్ ప్రైం కోసం రాజ్ డీకే చేసిన ఫ్యామిలీ మెన్ 2 కోసం నెగటివ్ పాత్రలో నటించింది సమంత.

ఆ వెబ్ సీరీస్ తో సమంత బాలీవుడ్ లో హాట్ ఫేవరెట్ అయ్యింది.ఆ వెబ్ సీరీస్ తర్వాత అమ్మడికి మరో క్రేజీ వెబ్ సీరీస్ ఛాన్స్ కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు అక్కడ సినిమా ఆఫర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.ఇదిలాఉంటే సమంత మరో క్రేజీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో ఒక సినిమా వస్తుంది.ఆల్రెడీ వీళ్లిద్దరు కలిసి మాస్టర్ సినిమా చేశారు.

Advertisement

ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేస్తూ సినిమా వస్తుంది.ఈ సినిమాలో సమంత నటిస్తుందని తెలుస్తుంది.

అయితే సినిమాలో సమంత హీరోయిన్ గా కాదు నెగటివ్ పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది.విజయ్ తో హీరోయిన్ గా జోడీ కట్టిన సమంత ఇప్పుడు నెగటివ్ పాత్రలో నటించడానికి రెడీ అయ్యింది.

ఇక సినిమాలతో సంబంధం లేకుండా సమంత ఫోటో షూట్స్ తో కూడా సత్తా చాటుతుంది.అయితే ఈమధ్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత రీసెంట్ గా కరణ్ జోహార్ తో చేసిన కాఫీ విత్ కరణ్ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

డైవర్స్ తర్వాత పూర్తిగా తన ఫోకస్ సినిమాల మీద పెట్టిన సమంత వచ్చిన ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుంటుంది.తెలుగులో ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం, హరి హరీష్ డైరక్షన్ లో యశోద సినిమాలు చేస్తుంది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

శాకుంతలం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే సినిమా షూటింగ్ పూర్తయినా సరే సినిమా ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు.

Advertisement

రిలీజ్ పై కూడా క్లారిటీ ఇవ్వలేదు చిత్రయూనిట్.విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది సమంత.

తాజా వార్తలు