తను మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమిస్తుందో చెప్పేసిన సమంత..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంతా ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Samantha Expresses Her Love On Audience Details,  Samantha, Tollywood, Love Audi-TeluguStop.com

తాజాగా సమంతా 35వ వసంతంలోకి అడుగుపెట్టింది.సమంత పుట్టినరోజు నాడు ఆమె నటించిన తమిళ సినిమా కాతు వాక్కుల రెండు కాదల్ సినిమా విడుదల అయ్యింది.

ఈ సినిమా విడుదల అయి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే టాక్ ని తెచ్చుకుంది.పుట్టినరోజు, అందులోనూ ఆమె నటించిన సినిమా విజయం కావడం రెండు సక్సెస్లు కలిసి రావడంతో సమంత కు అభిమానులు స్నేహితులు, అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి సమంత తాజాగా కృతజ్ఞతలు తెలిపింది.ఆ పోస్టులకు సంబంధించిన ఫోటోలను కూడా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది.

నా పుట్టినరోజు నాడు నాపైన ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపింది.అలాగే మీ అందరి ప్రోత్సాహం ప్రయోజన ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.

నన్ను ఇంతలా అభిమానిస్తున్న అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరినీ ప్రేమిస్తున్నాను అని తెలిపింది సమంత.

Telugu Love Audience, Naga Chaitanya, Nayanthara, Samantha, Samantha Offers, Tol

ఇకపోతే సమంత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ఇక సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.అంతేకాకుండా పూర్తిగా తన కెరీర్ పై దృష్టిని పెట్టింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకమైన కొటేషన్స్ షేర్ చేస్తూనే ఉంది.తర్వాత సమంత సోషల్ మీడియా లో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube