అంగన్వాడి స్థలం ఆక్రమిస్తున్న అధికార పార్టీ నాయకుడు

అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాపురం గ్రామ శివారులో ఉన్న ఇందిరమ్మ కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని అంగన్వాడి కేంద్రం( Anganwadi Center ) కోసం కేటాయించి,అంగన్వాడి కేంద్రం నిర్మిస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హామీ ఇచ్చిన స్థలం అధికార బీఆర్ఎస్ నాయకుడి చేతిలో కబ్జాకు గురవుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ స్థలం( Govt Land )లో మట్టి తోలిస్తూ డోజర్ తో లేవల్ చేస్తూ నాదే స్థలం అంటున్నారని తెలిపారు.

ఈ విషయమై స్థానిక ఎమ్మార్వో సంతోష్ కిరణ్ వివరణ కోరగా రామిరెడ్డిపాలెంలోని దేవాదాయ భూమి కబ్జా జరుగుతుందని తమకు సమాచారం చేరిందని,మా అధికారులను పంపించి పనులను నిలిపివేశామని, తదుపరి చర్యలు కొరకు విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారిని వివరణ కొరకు చరవాణిలో సప్రదించగా తప్పించుకునే రీతిలో వ్యవహరిస్తూ సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేయడం గమనార్హం.

Ruling Party Leader Occupying Anganwadi Center Land, Government Land,Suryapet Ne

ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని,అందులో అంగన్వాడి కేంద్రానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

గ్రూప్-1 లో ఫలితాల్లో హుజూర్ నగర్ ఎమ్మార్వోకు 488 మార్కులు
Advertisement

Latest Suryapet News