RP Patnaik : నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు మహేష్ కి పాడటం : ఆర్పీ

ఆర్పీ పట్నాయక్( RP Patnaik ).సంగీత దర్శకుడిగా నీ కోసం అనే చిత్రం తో తన ప్రయాణం మొదలు పెట్టాడు.

అక్కడ నుంచి 2016 వరకు నిర్విరామంగా సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.అయితే తనకు సంగీత పరంగా పట్నాయక్ జీవితంలో ఎలాంటి రిగ్రెట్స్ లేవు అంటున్నాడు ఒక నిజం సినిమాలో పాటలు పడటం తప్ప.

మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా నిజం( Nijam ) చిత్రంలో తాను పాడటాన్ని ఇప్పటికి ఎప్పటికి తనను తాను క్షమించుకోలేను అంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆర్పీ తెలిపారు.

Rp Patnayak Felt Bad To Sing For Mahesh

నిజం చిత్రానికి సంగీతం అందించే క్రమం లో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తాను మరియు సింగర్ ఉష ( Singer Usha )ఎక్కువ భాగం పాటలను పూర్తి చేశామని కానీ మహేష్ బాబు గొంతు కు నాకు అస్సలు సెట్ కాలేదని, తన గొంతు ఒక కిడ్డిష్ గొంతు అని తెలిపాడు ఆర్పీ.చాల మంది ఏమవుతుంది ఒక పాట సెట్ కాకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇంత చిన్న విషయాన్నీ అని ఎవరితో పాడితే వారితో పాడిస్తూ ఉంటారు కానీ నేను ఆలా చేయలేను అని, ఇన్నేళ్ల నా సంగీత ప్రపంచం లో సెట్ అవ్వకుండా పాడింది లేదు అంటూ చెప్పుకోచ్చాడు.ఇక ఒక స్టార్ హీరో కి పాడాల్సిన గొంతు నాది కాదంటూ చెప్తూనే ఈ సినిమా విడుదల అయ్యాక చాల మంది ఫోన్స్ చేసి ఇదే విషయాన్నీ చెప్పారని, అవకాశం ఉంది కానీ ఎలా పడితే ఆలా పాడేస్తావా అని మొహం మీదే అడిగేశారని చెప్పాడు.

Rp Patnayak Felt Bad To Sing For Mahesh
Advertisement
Rp Patnayak Felt Bad To Sing For Mahesh-RP Patnaik : నా జీవితం�

కానీ నిజం సినిమాలో ఆర్పీ గొంతు వల్ల ఎలాంటి డ్యామేజ్ జరగలేదు కాబట్టి ఆ ఒక్క విషయం లో తనకు బాధ లేదు అని చెప్పాడు.అయితే ఆర్పీ లాంటి సంగీత దర్శకుడు కారణాలు చెప్పకుండా దాదాపు ఏడేళ్లుగా మ్యూజిక్ చేయడం మానేసాడు.చాల మంది కుర్ర వాళ్ళు కూడా సంగీతంలో ప్రయోగాలు చేస్తుంటే తాను మాత్రం సంగీతం జోలికి పోకూడదు అని నిర్ణయించుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి అలాగే ఉన్నాడు.

మరి తొందరలో ఒక మంచి సినిమాతో మల్లి ఆర్పీ పట్నాయక్ బిజీ అవ్వాలని కోరుకుందాం .

Advertisement

తాజా వార్తలు