మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ( Sudheer Varma ) దర్శకత్వంలో రూపొందిన రావణాసుర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను ఈ వారంలో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
రవితేజ గత చిత్రం ధమాకా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో రవితేజ జోరు మీదున్నాడు.

రావణాసుర సినిమా( Ravanasura ) కూడా హిట్ అయితే మాత్రం రవితేజ జోరును ఆపడం ఏ ఒక్కరి తరం కాదు.ఏడాదికి మూడు సినిమా లు తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు ఈయన వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.అంతే కాకుండా రవితేజ ఇన్నాళ్లుగా వద్దనుకుంటూ వస్తున్న కొన్ని ప్రాజెక్ట్ లను కూడా మళ్లీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను రవితేజ మొదలు పెడతాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వారంలో రావణాసుర సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇదే ఏడాది లో టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి రవితేజ యొక్క జోరు డబుల్ అయ్యే విధంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రావణాసుర సినిమా యొక్క కలెక్షన్స్ మరియు ఇతర విషయాల పట్ల కొందరు కొందరు కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా రావణాసుర చిత్రంపై దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ తప్పకుండా రవితేజ( Ravi Teja ) కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా సినిమా కోసం కాస్త ఎక్కువగానే ప్రమోషన్ చేస్తున్నారు.
కనుక రవితేజ యొక్క రావణాసుర సినిమా సక్సెస్ టాక్ దక్కించుకుంటే భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం.







