CM Jagan : 8 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు..: సీఎం జగన్

కర్నూలు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) కొనసాగుతోంది.

ఇందులో భాగంగా తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.తాము అందించిన సంక్షేమ పథకాల్లో కులం, మతం, పార్టీలు చూడలేదన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామని పేర్కొన్నారు.

తుగ్గలిలో 95 శాతం ఇళ్లకు లబ్ధి జరిగిందన్న సీఎం జగన్( CM Jagan ) లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అమలు చేశామని తెలిపారు.58 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.తుగ్గలి గ్రామస్తులకు రూ.29.65 కోట్ల లబ్ధి జరిగిందని తెలిపారు.అదేవిధంగా రాతన సచివాలయ పరిధిలో రూ.26.59 కోట్ల లబ్ధి చేకూరిందని సీఎం జగన్ వెల్లడించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు