ఈ మధ్యకాలంలో ఎండలు బాగా పెరిగిపోతున్నాయి.అలాగే వాతావరణంలో తేమ తగ్గిపోతుంది.
దాంతో మన శరీరంలో కనిపించే మొదటి ఇబ్బంది డిహైడ్రేషన్.( Dehydration ) చూడడానికి ఇది చిన్న విషయం లా కనిపించిన శరీరంలో మెరుపు తగ్గడం నుంచి నిస్సత్తువ వరకు ఎన్నో సమస్యలు కనిపిస్తాయి.ఒక్కోసారి ఒళ్లంతా నొప్పులు, కండరాలు పట్టేసినట్లు కూడా ఉంటుంది.ఈ సూచనలు ఏవి పెద్దపెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కాకపోవచ్చు.శరీరంలో తగినన్ని నీటి విలువలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.మీరు తరచూ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తగినన్ని నీళ్లు తాగడం మంచిది.
డిహైడ్రేషన్ సమస్యను గుర్తించడానికి తలనొప్పి కూడా ఒక ముఖ్య సూచన.
ఈ సారి భరించలేనంత తలనొప్పి( Headache ) వచ్చినప్పుడు ఒక రెండు గ్లాసుల నీరు త్రాగడం ఎంతో మంచిది.అంతేకాకుండా మూత్రం రంగు మారితే వెంటనే రెండు గంటలకు ఒకసారి నాలుగైదు సార్లు బార్లీ నీళ్లు( Barley Water ) తాగడం మంచిది.ఇలా చేస్తే సమస్య వెంటనే దూరం అయిపోతుంది.
అలసట నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఒక కొబ్బరి బొండం( Coconut ) తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇందులోని ఎలక్ట్రోలైట్స్ నీరసాన్ని తగ్గిస్తాయి.ఈ నీళ్లు శరీరంలో డిహైడ్రేషన్ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఒంట్లో నీటి శాతం తగ్గితే భావోద్వేగాల్లోనూ హెచ్చుతగ్గులు వస్తాయని ఒక అధ్యయనంలో తెలిసింది.
అలాగే మానసిక అలసట, చికాకు ఇబ్బంది పెడుతుంటాయి.అంతేకాకుండా రోజు మీకు హాయిగా గడిచిపోవాలంటే కూడా ఉదయం లేచిన వెంటనే తగినన్ని నీరు త్రాగడం మంచిది.ఇలా చేస్తే మీ శరీర జీవ క్రియలు అన్ని సక్రమంగా పని చేస్తాయి.
ఉల్లిపాయతో మరో రకమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే నోటి దుర్వాసన వస్తుంది అనుకుంటే పొరపాటే.ఇది కూడా మీ శరీరంలో నీటి శాతం తగ్గడానికి ఒక ముఖ్య కారణం.
శరీరంలో నీటి నిల్వలు తగ్గినప్పుడు సలైవా ఉత్పత్తి తగ్గిపోవడమే ముఖ్య కారణం.ఫలితంగా బ్యాక్టీరియా పెరిగి ఈ సమస్య ఎక్కువగా అవుతుంది.
ఈ సమయంలో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.