పవన్ కళ్యాణ్ 11 సినిమాలు రీమేక్ చేస్తే ఎన్ని హిట్ కొట్టాయి

స్ట్రెయిట్ సినిమాల కంటే రీమేక్ చిత్రాల‌తోనే విజ‌యాలు సాధించ‌వ‌చ్చు అంటారు ప‌లువురు సినీ ప‌రిశ్ర‌మకు చెందిన వ్య‌క్తులు.

ఇత‌ర భాష‌ల్లో హిట్ చిత్రాల‌ను మ‌న ప్రాంతీయ‌త‌కు అనుకూలంగా మ‌లిచి తీస్తే హిట్ కొట్ట‌డం సుల‌భం అని చెప్తారు.

తెలుగులో రీమేక్ చిత్రాలు చేసి బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన హీరోల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌.ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు 24 సినిమాల్లో న‌టించ‌గా అందులో 11 రీమేక్ సినిమాలే కావ‌డం విశేషం.అందులో 7 బంఫ‌ర్ హిట్లు ఉన్నాయి.

ఇంత‌కీ ఆయ‌న న‌టించిన రీమేక్ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!గోకులంలో సీతత‌మిళంలో సంచ‌ల విజ‌యం సాధించిన ‘గోకులతిల్ సీతై’ చిత్రానికి ఈ మూవీ రీమేక్.పవన్ కళ్యాణ్, రాశీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.సుస్వాగతం

Result Of Power Star Pawan Kalyan Remake Movies , Power Star Pawan Kalyan, Remak
Advertisement
Result Of Power Star Pawan Kalyan Remake Movies , Power Star Pawan Kalyan, Remak

త‌మిళంలో విజ‌య్ హీరోగా చేసిన ‘లవ్ టుడే’ సినిమాకు ఈ మూవీ రిమేక్.పవన్ కళ్యాణ్, దేవయాని హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాను భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు.ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.ఖుషి

Result Of Power Star Pawan Kalyan Remake Movies , Power Star Pawan Kalyan, Remak

తమిళంలో విజయ్ హీరోగా రూపొందించిన ‘ఖుషి’ సినిమాని.అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.భూమిక, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి న‌టించారు.

ఈ మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది.అన్నవరం

Result Of Power Star Pawan Kalyan Remake Movies , Power Star Pawan Kalyan, Remak

తమిళంలో విజయ్ హీరోగా చేసిన ‘తిరుపచి’ మూవీకి రీమేక్ ఇది.పవన్ కళ్యాణ్, ఆసిన్ జంటగా నటించారు.భీమనేని శ్రీనివాసరావు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?

ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.తీన్ మార్

Advertisement

బాలీవుడ్ మూవీ ‘లవ్ ఆజ్ కల్’ చిత్రానికి ఈ మూవీ రీమేక్.పవన్ కళ్యాణ్, త్రిష జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ డైరెక్ట్ చేశారు.ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.గబ్బర్ సింగ్

బాలీవుడ్‌లో స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ మూవీకి ఇది రిమేక్.పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.గోపాల గోపాల

బాలీవుడ్ మూవీ ‘ఓ మై గాడ్’ కు ఇది రీమేక్.పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రానికి డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఈ మూవీ కూడా విజ‌యం సాధించింది.కాటమరాయుడు

అజిత్ హీరోగా త‌మిళంలో తెరెక్కిన ‘వీరం’ సినిమా రిమేక్ ఇది.పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన ఈ మూవీకి డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది.వకీల్ సాబ్

బాలీవుడ్‌లో అమితాబ్, తాప్సి న‌టించిన ‘పింక్’ చిత్రానికి ఈ మూవీ రీమేక్.వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు.

తాజా వార్తలు