రేపాల ప్రత్యేక మండల కోరిక న్యాయమైనది: వేమూరి

సూర్యాపేట జిల్లా:రేపాల కేంద్రం( Repala )గా 11 నాన్ కెనాల్ గ్రామ పంచాయితీలను కలుపుతూ నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్న కోరిక న్యాయమైనదని,రేపాలకు మండలానికి కావాల్సిన అన్ని రకాల వనరులు, వసతులు ఉన్నాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు వేమూరి సత్యనారాయణ అన్నారు.

సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండలం రేపాల గ్రామంలో రేపాల మండల సాధన సమితి అధ్వర్యంలో నిర్వహించిన సదుస్సుకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వాలు చిన్న రాష్ట్రాలు,చిన్న జిల్లాలను, చిన్న మండలాలను ఏర్పాటు చేసిందని, దానితో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయని భావించిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మండలాల విభజన జరిగే సమయంలోనే రేపాలను మండల కేంద్రంగా చేయాల్సి ఉండేదని, ఇక్కడి నుండి రాజకీయ పరమైన డిమాండ్ లేకపోవడంతో పట్టించుకోలేదన్నారు.ఇప్పటికైనా దశాబ్దాల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ 11 నాన్ కెనాల్ గ్రామాలను కలిపి ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని,ఎలాంటి ఆందోళనలు చేయకుండానే ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని ప్రత్యేక మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Repala's Desire For Special Mandal Is Fair: Vemuri, Vemuri , Repala, Repala Ma

రేపాల మండల సాధన సమితి ( Repala Mandal Sadhana Samiti )గ్రామ జేఏసీ కన్వీనర్లు వరికల రమేష్,పల్లి ఆదిరెడ్డి,పోనుగోటి రంగా అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో మొగిలిచర్ల సత్యనారాయణ ప్రారంభోపన్యాసం చేయగా,అఖిలపక్ష నాయకులు,గ్రామ జేఏసీ నాయకులు,పెద్దలు, యువకులు,విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?
Advertisement

Latest Suryapet News