ఆ బ్యానర్‌లో సినిమాకు రవితేజ ఓకే

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Raviteja To Do Movie With UV Creations, Raviteja, UV Creations, Prabhas, Krack,

ఇదిలా ఉండగా రవితేజ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.ఇప్పటికే వీర దర్శకుడు రమేశ్ వర్మతో రవితేజ ఓ సినిమా చేసేందుక పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోండగా, దర్శకుడు నక్కిన త్రినాథరావుతో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ మూవీలో నటించేందుకు కూడా ఆయన ఓకే అన్నట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ను రవితేజ ఓకే చేశాడట.ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే ఓ సినిమాలో నటించేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Advertisement

ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సదరు నిర్మాతలు రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరు అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక రవితేజ క్రాక్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న రవితేజ, క్రాక్ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, సముథ్రికని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు