'టైగర్ నాగేశ్వరరావు' మేకర్స్ ప్లాన్ సక్సెస్.. ఫస్ట్ లుక్ తోనే భారీ హైప్!

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)హీరోగా డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు” ( Tiger Nageswara Rao ).ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ నిన్న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

 Ravi Teja's Tiger Nageswara Rao First Look Out, Ravi Teja, Tiger Nageswara Rao,-TeluguStop.com

రాజమండ్రిలోని హావ్ లాక్ బ్రిడ్జ్ మీద గ్రాండ్ గా విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ ( Tiger Nageswara Rao First Look ) కు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.

నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియో గూస్ బంప్స్ తెప్పించింది.

మరి మేకర్స్ ముందు నుండి ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో చేత వాయిస్ ఓవర్ చెప్పించి వారితోనే రిలీజ్ చేయించడం ఈ సినిమా ప్రమోషన్స్ కు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.ఒకే ఒక్క పోస్టర్ తో ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

Telugu Anupam Kher, Ravi Teja, Ravitejas, Tigernageswara, Tollywood-Movie

కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఈ సినిమా విషయంలో ముందు నుండి మేకర్స్ అండ్ రవితేజ కూడా గట్టి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.ఇక ఈ ఫస్ట్ లుక్ కు వీరు చేసిన ప్లానింగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.దీంతో ఈ సినిమాకు భారీ హైప్ పెరిగింది అనే చెప్పాలి.నార్త్ మార్కెట్ లో కూడా ఈసారి మాస్ రాజా సినిమాకు సాలిడ్ నంబర్స్ నమోదు అయ్యేలా కనిపిస్తుంది.

Telugu Anupam Kher, Ravi Teja, Ravitejas, Tigernageswara, Tollywood-Movie

ఈ అవైటెడ్ సినిమా రవితేజ కేర్ ఎయిర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.నిజ జీవిత సంఘటనల ఆధారంగా 1970ల కాలం నాటి టైగర్ జోన్ గా పిలువబడే స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు లైఫ్ గురించి ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా. అనుపమ్ ఖేర్( Anupam Kher ), రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube