రవితేజ డెడికేషన్‌ కు హ్యాట్సాఫ్... నువ్వు మాస్‌ రాజా గురు!

మాస్‌ మహా రాజా రవితేజ వయసు చాలా తక్కువ గా కనిపిస్తుంది కాని.ఆయన సీనియర్ హీరోల కు కాస్త అటు ఇటుగానే ఉంటాడు.

అయిదు పదుల వయసు దాటి కూడా చాలా సంవత్సరాలు అయ్యింది.అయినా కూడా రవితేజ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.

యంగ్‌ హీరోలకు పోటీ అన్నట్లుగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.హీరోగా రవితేజ చేస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తున్నాడు.కెరీర్‌ ఆరంభంలో చేసినట్లుగా ఈ వయసు లో కూడా చేస్తున్నాడు.

Advertisement

ఆరు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఆ ఛాయలు కనిపించని రవితేజ తాజాగా ఒక పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాడు.ఆ విషయం చాలా తక్కువ మందికి తెలిసింది.

విషయం ఏంటీ అంటే టైగర్ నాగేశ్వరరావు సినిమా కు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో గాయాలు అయ్యాయి.ఆ గాయాలు మానడానికి కనీసం రెండు నెలలు సమయం పడుతుందని వైధ్యులు అన్నారట.

కేవలం రెండు రోజుల్లోనే షూటింగ్‌ కు రవితేజ జాయిన్ అయ్యి అందరిని ఆశ్చర్యపర్చాడట.సినిమా కోసం చాలా మంది నటీ నటులు వర్క్‌ చేస్తూ ఉంటారు.

పీటర్ హెయిన్స్ తో పాటు ఇతర ముఖ్యులకు సంబంధించిన డేట్లు వృదా అవుతాయనే ఉద్దేశ్యంతో కష్టం అయినా కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌ లో రవితేజ జాయిన్ అయ్యాడని తెలుస్తోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం రవితేజ మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

అందుకే ఈ సినిమా ఆలస్యం కాకుండా రవితేజ ప్లాన్ చేసి మరీ గాయాలతోనే సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది.నిజంగా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

ఈ వయసు లో కూడా ఇంత యాక్టివ్‌ గా షూటింగ్‌ లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు.

తాజా వార్తలు