అయ్యో పాపం... రష్మిక కు అంతలోనే ఏమైపోయింది..?

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా హీరోయిన్స్ ఒక అవకాశం వచ్చినప్పుడే గట్టిగా మరో అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

సినిమాలు లైన్లో పెట్టుకుంటూ వరుస అవకాశాలను దక్కించుకుంటారు.

ఇందులో రష్మిక మందన కూడా ఏమాత్రం తక్కువ తినలేదు.నేషనల్ బ్యూటీ అయినా రష్మిక ( Rashmika Mandanna )కన్నడ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇక్కడ నటిస్తూనే హిందీలో పాగా వేసే ప్రయత్నం చేసింది.అందరి హీరోయిన్స్ లాగానే సౌత్ నుంచి నార్త్ కు వెళ్ళిన వారు పడినట్టుగానే ఇబ్బందులు కూడా పడింది.

మొదట్లో ఇవన్నీ కాస్త కష్టంగానే అనిపించినా అక్కడ వారి పద్ధతులు, సంస్కృతి, కల్చర్ నేర్చుకుని ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది .

Advertisement

అయితే ఇవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు.ఈలోపు ఆనిమల్ సినిమా( Animal movie )తో రష్మికలో ఒక కొత్త నటిని చూశారు బాలీవుడ్ ప్రేక్షకులు.ఈ సినిమా ద్వారా అక్కడ వారికి కొత్త అందాలు పరిచయం చేశాడు సందీప్ రెడ్డి వంగా.

పుష్ప సినిమా( Pushpa ) కూడా ఆమెకు ఎంతగానో ఉపయోగపడింది.ఇది సౌత్ సినిమా గానే అక్కడివారు గుర్తించిన ఆనిమల్ సినిమాను మాత్రం పూర్తిస్థాయి హిందీ చిత్రంగా గుర్తించారు.

ఆ తర్వాత ఎడాపెడా రష్మిక మందన సినిమాలకు సైన్ చేస్తుంది అని అందరూ భావించారు.కానీ ఎందుకో కానీ అనుకున్నంత వేగంగా ఆమె కెరియర్ ముందుకు సాగడం లేదు.

ఓవైపు విజయ్ దేవరకొండ సైతం కష్టాలు పడుతున్నాడు.తన సినిమాలు విజయాలు అందుకోవడం లేదు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మొదట విజయ్ సపోర్ట్ తోనే బాలీవుడ్ లో గట్టిగా పాగా వెయ్యగలిగింది.

Advertisement

అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ నటించాడు.అప్పటి సందీప్ రెడ్డివంగ తో ఉన్న స్నేహం తో ఆనిమల్ సినిమాలో అవకాశం దక్కింది.ఈ సినిమా విజయం సాధించిన ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.

అంతకు ముందు ఒప్పుకున్న సినిమాల కాల్ షీట్స్ వల్ల కొత్త సినిమాలు సైన్ చేయడం లేదా లేక అక్కడ వారు రష్మికను పట్టించుకోవడం లేదా అర్థం కావడం లేదు.ప్రస్తుత ఆమె చాలా రోజుల క్రితమే కమిట్ అయినా రెయిన్ బో, పుష్ప సీక్వెల్, ది గర్ల్ ఫ్రెండ్, చావా సినిమాలను చేస్తుంది.

కొత్తగా ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.మరి ఇక రష్మిక పని బాలీవుడ్ లో అయిపోయినట్టేనా అని అందరూ గుసగుస లాడుతున్నారు.

తాజా వార్తలు