ఇటీవల కాలంలో ఎన్టీఆర్ కి( NTR ) సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఎన్టీఆర్ సినిమాల గురించి మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాలతో పాటు ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఎన్టీఆర్ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఈయన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2( War 2 ) బాలీవుడ్ సినిమా కోసం ముంబై వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.ముంబైలో( Mumbai ) కొద్దిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీ కాబోతున్నారు.
మరోవైపు ఈయన తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie ) పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఏకంగా రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతుంది ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతుంది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ కి సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది.అయితే ఎన్టీఆర్ ని కనుక మనం గమనించినట్లు అయితే ఈయన మన ఇండియాలోనే ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్ వెళ్లిన లేదా మరొక కంట్రీ కి వెళ్ళిన తనకంటూ పర్సనల్ గా ఒక బ్యాగ్( Bag ) వేసుకొని మనకు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు.ఇలా ఆ బ్యాగులో తన ఎమర్జెన్సీ వస్తువులను పెట్టుకొని ఉంటారని తెలుస్తోంది.
ఇక ఈయన ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ లో మాత్రం తప్పకుండా ఒక వస్తువు ఉండాల్సిందేనట ఆది గనక లేకపోతే ఆయనకు ఏ మాత్రం దిక్కు తోచదని తెలుస్తుంది.అందుకే ఏ దేశం వెళ్లిన తన బ్యాగులో ఆ వస్తువు తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది.మరి ఎన్టీఆర్ అంత ఇంపార్టెంట్ గా ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లే వస్తువు ఏది అనే విషయానికొస్తే అది మరేదో కాదు పుస్తకాలు( Books ) అని తెలుస్తుంది.
ఎన్టీఆర్ జర్నీ చేసేటప్పుడు లేదంటే రాత్రి పడుకోవడానికి ముందుగా పుస్తకాలు చదివే అలవాటు ఉందట.
అందుకే ఏదో ఒక పుస్తకాన్ని తన బ్యాక్ లో వేసుకొని వెళ్లిపోతూ ఉంటారట అలా జర్నీలో చదవడం లేదంటే నైట్ పడుకోవడానికి కాసేపు పుస్తకాన్ని అలా తిప్పేస్తే తప్ప ఆయనకు నిద్ర పట్టదని తెలుస్తోంది.అయితే ఇలా ఇండస్ట్రీలో ఎక్కువగా బుక్స్ చదివే అలవాటు పవన్ కళ్యాణ్ కి ఉందని మనకు తెలుసు.ఆయన ఎక్కడికి వెళ్ళినా తన చేతిలో బుక్ కనిపిస్తూ ఉంటుంది అలాగే ఎన్టీఆర్ కూడా ఎక్కడికి వెళ్ళినా బుక్ పట్టుకొని వెళ్తారట.
ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ కి పుస్తకాలు చదవడం అంటే ఇంత ఇష్టమా అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.