ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇంటర్ ఫలితాలు( Inter results ) విడుదలైన సంగతి తెలిసిందే.నంద్యాల విశ్వ నగర్ కు చెందిన గిద్దలూరు సందీప్ ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ ఫలితాలలో సందీప్ నంద్యాల టౌన్ టాపర్ గా నిలిచారు.అతని సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
తాజాగా రిలీజైన ఫలితాలలో సందీప్ 470 మార్కులకు 460 మార్కులు సాధించారు.
పదో తరగతిలో సైతం మంచి మార్కులు సాధించిన సందీప్( Sandeep ) ఇంటర్ లో ప్రతిభ చాటుకున్నారు.బీటెక్ చేయడం తన కల అని చెబుతున్న సందీప్ వచ్చే ఏడాది పోటీ పరీక్షల్లో సైతం మంచి ఫలితాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఎంతో కష్టపడి ఇంటర్ లో మంచి మార్కులు సాధించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని సందీప్ చెబుతున్నారు.
సందీప్ తండ్రి ఎలక్ట్రీషియన్ గా పని చేస్తుండగా ఎంతో కష్టపడి తన కొడుకును చదివించడం జరిగింది.తల్లీదండ్రులను బాగా చూసుకోవడమే తన కల అని సందీప్ పేర్కొన్నారు.సందీప్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సందీప్ టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సందీప్ మరెన్నో విజయాలను అందుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు.సందీప్ ఒక్కో మెట్టు పైకి ఎదగాలని నెటిజన్లు సోషల్ మీడియా( Social media ) వేదికగా అభిప్రాయపడుతున్నారు.
సందీప్ కు ఎవరైనా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే వాళ్ల కెరీర్ మరింత వేగంగా పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.సందీప్ కు అండగా నిలిచిన అతని కుటుంబ సభ్యులను సైతం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు సైతం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.ఇంటర్ ఎంపీసీ చదివిన సందీప్ ఎంతో కష్టపడటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు.