తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ( Shabbar Ali ) కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ సభ ఎన్నికల తరువాత కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని చెప్పారు.
అదేవిధంగా మరి కొంతమంది బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా జైలుకు వెళ్లడం తప్పదని తెలిపారు. కవిత లిక్కర్ స్కాం( Kavitha Liquor Scam )తో పాటు భూ దందాలు బయటపడుతున్నాయని చెప్పిన షబ్బీర్ అలీ ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ). తో భార్యాభర్తల మాటలను వినడం సిగ్గుచేటని పేర్కొన్నారు.పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని తెలిపారు.
పదేళ్లు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్( BRS ) ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.అదేవిధంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.