పేటలో ఘనంగా రాజీవ్ వర్ధంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) అని,ఈ దేశానికి టెక్నాలజీ అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని,సెల్ ఫోన్ ను పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ అని మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం(రెడ్ హౌస్) లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఘన విజయం సాధిస్తుందని, భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పీఠం ఎక్కబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో గత పది సంవత్సరాల నుండి బీజేపీ చేసింది ఏమీలేదని, ఈ సారి ఆ పార్టీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళ సమాఖ్యలో భారీ కుంభకోణం.. 28 లక్షలు స్వాహా
Advertisement

Latest Suryapet News