రాజయ్య మైనేస్సే కడియం కు ప్లస్ ! ఆయన ఏ పార్టీ లోకి ? 

నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కెసిఆర్( CM kcr ) ప్రకటించారు.115 మంది తో కూడిన జాబితాను ప్రకటించారు .ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు.అయితే కొంతమంది సీనియర్ నాయకులైన సిట్టింగ్ ఎమ్మెల్యే లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం , అనేక వ్యవహారాల్లో పార్టీకి,  ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో,  వారిని తప్పించారు.

 Rajayya Mainesse Is A Plus For Kadiam Which Party Is He In, Station Ghanpoor , M-TeluguStop.com

ఆ లిస్టులో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య కూడా ఉన్నారు.రాజయ్య స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి( Kadiyam Srihari )ని కెసిఆర్ పోటీకి దించుతున్నారు.

ఈ మేరకు అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు కూడా ఉంది.అయితే మళ్లీ తనకే టికెట్ ఖాయమని , తనపై వచ్చిన ఆరోపణలను కేసీఆర్ పట్టించుకోరని భావించిన రాజయ్యకు పెద్ద షాకే తగిలింది.

దీంతో ఇప్పుడు రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు.ఏ పార్టీలో చేరాలనే విషయం పై అనుచరులతో చర్చిస్తున్నారు.కాంగ్రెస్ లేదా బీఎస్పీలో  చేరాల్సిందిగా అనుచరుల నుంచి ఒత్తిడి వస్తోందట.

Telugu Brs Mla, Kadiyam Srihari, Mla Rajayya, Navya, Rajayya Navya, Srihari, Gha

ఈ మేరకు హైదరాబాదులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనుచరులతో రాజయ్య చర్చిస్తున్నారు.అసలు కెసిఆర్ రాజయ్యకు టికెట్ నిరాకరించడానికి కారణం జానకిపురం సర్పంచ్ నవ్య పై లైంగిక ఆరోపణలే కారణం.రాజయ్య తనను లైంగికంగా వేధించాడని జానకిపురం సర్పంచ్ నవ్య ( Surpunch navya )మీడియా లో రచ్చ చేయడం,  ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారడంతో , బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది.

దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనకు ఇస్తే గెలిచి చూపిస్తానని చెప్పడంతో,  కెసిఆర్ కడియం శ్రీహరి వైపే మొగ్గు చూపించారు.ఇక రాజయ్య లైంగిక ఆరోపణ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలయ్యారు.

Telugu Brs Mla, Kadiyam Srihari, Mla Rajayya, Navya, Rajayya Navya, Srihari, Gha

ఆ తరువాత ఆరోపణలు చేసిన జానకిపురం సర్పంచ్ నవ్య తో చర్చలు జరిపి వివాదానికి ముగింపు పలికారు.ఆ తర్వాత ఈ వ్యవహారం మరోసారి వైరల్ అవ్వడం,  రాజయ్య ( mla rajayya )వ్యవహార శైలిపై అనేక విమర్శలు రావడం,  మళ్ళీ ఆయనకు టిక్కెట్ ఇస్తే బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాతో కెసిఆర్ రాజయ్యను పక్కన పెట్టేందుకు నిర్ణయించుకుని ఆయనకు టికెట్ నిరాకరించారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube