రాజమౌళి వణికించి వదిలిపెట్టాడు

బాహుబలి రెండొవభాగం ఎప్పుడు .ఎప్పుడు .ఎప్పుడు? పేరుకి మాత్రమే తెలుగు సినిమా.హిందీ, తెలుగు,తమిళం,మళయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 Rajamouli Provided Relief For Aamir Khan-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేది గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించింది ఎవరు అంటే అది ఆమీర్ ఖానే అని చెప్పాలి.

తన తదుపరి చిత్రం దంగల్ ని డిసెంబర్‌ లో దింపుతున్నాని ఎప్పుడో ప్రకటించేసాడు ఆమీర్.

బాహుబలి రెండొవ భాగం కూడా ఈ ఏడాది చివర్లోనే వస్తుంది అనడంతో ఆమీర్ ఖాన్ గుండెల్లో గుబులు మొదలైంది.ఒకానొక దశలో దంగల్ క్రిస్టమస్ కి బదులు, స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా, ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్మట్లు వార్తలు వినిపించాయి.

అంతలా వణికించాడు రాజమౌళి.ఆ రెంజ్ లో క్రేజ్ నెలకొని ఉంది బాహుబలికి హిందీ మార్కెట్ లో.

ఇక్కడ ఆమీర్ ఖాన్ ను తక్కువ చేయడం కాదు కాని .వాస్తవం మాట్లాడుకుంటే ఖాన్ త్రయం కన్నా, సూపర్ స్టార్లు, పవర్ స్టార్ల కన్నా పెద్ద రేంజిలో ఉంది బాహుబలి.దంగల్ తో తలపడి ఉండుంటే దంగల్ కలెక్షన్లు చాలావరకు తినేసేది బాహుబాలి.ఇప్పుడు బాహుబలి విడుదల తేది ఏప్రిల్ 14,2017 అని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఆమీర్.

ఇక హాయిగా తనకి అచ్చొచ్చిన క్రిస్టమస్ కే తన సినిమా విడుదల చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube