మన దక్షిణాది రాష్ట్రాలలో ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని కాంబినేషన్లో సినిమాలు తెరపైకి వస్తున్నాయి.ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు కేవలం కొందరి హీరోలతో మాత్రమే సినిమాలు రిపీటెడ్ గా తీసేవారు.
కానీ ప్రస్తుతం అందరి స్టార్ హీరోలతో సినిమా చేయాలని అత్యుత్సాహం దర్శక నిర్మాతలలో కనబడుతోంది.ఈ క్రమంలోనే రాజమౌళి పై ఇలాంటి అభియోగాలు చాలా వచ్చాయి.
రాజమౌళి కేవలం తీసిన హీరోలతోనే సినిమాలు తీస్తారనే వార్తలు వినిపించాయి.ఇకపై ఇలాంటి వార్తలకు జక్కన్న చెక్ పెట్టబోతున్నారు.
రాజమౌళి ఇప్పటి వరకు ఎన్టీఆర్ , ప్రభాస్, రామ్ చరణ్ తో ఇదివరకే సినిమాలు తీశారు.అయితే ఇకపై తన దర్శకత్వంలో కొత్త హీరోలతో సినిమాలు తీయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న “RRR” సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకులముందుకురానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తరువాత దర్శకధీరుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఇప్పటికే కొంత మేర స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో తెలియజేశారు.

ఇదిలా ఉండగా మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.ఎన్నో సినిమాలలో బన్నీ నటనకు డ్యాన్సులకు ఫిదా అయిన జక్కన్న తనతో సినిమా తీయాలని భావించారు.అయితే అల్లు అర్జున్ అంచనాలకు తగ్గట్టుగా కథ సెట్ అవ్వకపోవడంతో అల్లు అర్జున్ తో సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.సపరేటు గానే వీరిద్దరి సినిమాలు అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి.
అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.వారి అంచనాలకు ధీటుగా కథ దొరకక పోవడం వల్లే ఈ కాంబినేషన్లో సినిమా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
మొత్తానికి రాజమౌళి మహేష్ బాబుతో సినిమా పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.