చిరంజీవి మాటతో రోజంతా అన్నం మానేసిన రఘు కుంచె..

రఘు కుంచె.తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

ఒకప్పుడు సినిమాలు అంటే ఈయనకు ఎంతో పిచ్చి.

అందుకే ఇండస్ట్రీపై ఇష్టంతో చదువుకు గుడ్ బై చెప్పి.

హైదరాబాద్ లో అడుగు పెట్టాడు.అక్కడికి రాగానే ఆయనకు అవకాశాలు దొరకలేదు.

అప్పటికే అసిస్టెంట్ దర్శకుడిగా కొనసాగుతున్న పూరీ జగన్నథ్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది.ఇద్దరు కలిసి ఒకే రూంలో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారు.

Advertisement
Raghu Kunche Emotional Incident With Chiranjeevi , Raghu Kunche , Emotional Inci

ఒక రోజు రూంలో రఘు ఓ పాట పాడాడు.ఈ పాట పూరీ జగన్నాథ్ కు ఎంతో నచ్చింది.

వెంటనే తనకు ఓ మాట ఇచ్చాడు.నా తొలి సినిమాలో నీకే అవకాశం ఇస్తానని.

Raghu Kunche Emotional Incident With Chiranjeevi , Raghu Kunche , Emotional Inci

కొద్ది రోజుల తర్వాత పూరీ జగన్నాథ్ కు దర్శకుడిగా అవకాశం వచ్చింది. పవన్ కల్యాణ్ తో బద్రి సినిమా చేస్తున్నాడు.తొలి సినిమా కావడంతో కష్టపడి పనిచేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

అయితే ఈ సినిమాలో రఘుకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు.తన రెండో సినిమా జగపతి బాబుతో చేశాడు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

బాచి అనే సినిమాలో లక్ష్మీ అనే పాట పాడే అవకాశం కల్పించాడు.అటు చిరంజీవి ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉన్నాడు.

Advertisement

మృగ‌రాజు మూవీ డ‌బ్బింగ్ కోసం స్టూడియోకు వెళ్లాడు.అక్కడ రఘు తన అభిమాన హీరో చిరంజీవిని చూసి ఎంతో సంతోష పడ్డాడు.

ఇక చిరుకు తను పాడిన లక్ష్మీ అనే పాటను వినమని ఓ సీడీ ఇచ్చాడట.దాన్ని వెళ్తూ కారులో విన్నాడట చిరంజీవి.

వెంటనే తను రఘుకు ఫోన్ చేశాడట.

రఘు.నువ్వు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది.ఇంత చక్కగా పాడుతావు అనుకోలేదు అని చెప్పాడట.

అటు తన తాజా సినిమా మృగ‌రాజు మూవీలో ఓ పాట పాడే అవకాశం కూడా ఇచ్చాడట.తను ఎంతో అభిమానించే చిరంజీవి.

తనను మెచ్చుకోవడమే కాకుండా.ఆయన సినిమాలో పాడే అవకాశం ఇవ్వడంతో ఆయన సంతోషానికి అవదులు లేవట.

ఒక రోజు మొత్తం అన్నం తినకుండా ఉన్నాడట.చిరు తనతో చెప్పిన మాటను తన మిత్రులతో, కుటుంబ సభ్యులతో చెప్పి ఎంతో ఆనందించాడట.

తాజా వార్తలు