రావిచెట్టు కోసం శోకాలు పెడుతున్న పుర ప్రజలు

నేరేడుచర్ల అనగానే ముందుగా గుర్తొచ్చేది రావిచెట్టు, పట్టణ వాసులే కాదు,ప్రయాణికులు కూడా రావిచెట్టును చూసే ఇక్కడ దిగేవారు.ఈ చెట్టుకోసం ఉద్యమాలు కూడా జరిగాయి.

అందరికీ నీడనిచ్చే ఏళ్ల నాటి రావిచెట్టు నేటితో కనుమరుగు.కన్నీళ్లు పెట్టుకున్న పుర ప్రజలు.

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల పట్టణంలో ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్ళ చరిత్రను సొంతం చేసుకుని, ప్రకృతి వేసిన పందిరిగా పచ్చగా పరుచుకొని,నిత్యం ఎందరికో చల్లటి నీడనిచ్చిన నేరేడుచర్ల రావిచెట్టు చరిత్ర నేటితో కనుమరుగైపోనుంది.నేరేడుచర్ల పరిసర ప్రాంతాల వారికి,ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఇక్కడికి రాగానే ముందుగా కనపడేది,వారికి చల్లని విశ్రాంతి నిచ్చేది ఈ రావిచెట్టు.

ఈ చెట్టును చూసే అది నేరేడుచర్ల అని గుర్తు పట్టేవారంటే అతిశయోక్తి కాదేమో.అంతే కాకుండా ఎన్నో ఏళ్ళుగా ఎందరో నిరుపేద చిరు వ్యాపారులకు తన నీడలో ఉపాధి కల్పించింది.

Advertisement

ప్రయాణికులకు ఒక బస్సు ప్రాంగణంగా, మండుటెండల్లో దేహానికి దాహానికి చిరు చెమటలకు చల్లదనంగా,ఎంతోమందికి ఆసరాగా నిలిచింది.వేసవి కాలంలో ఎండకి ఎండకుండా,వర్షా కాలంలో వానకు తడవకుండా ఎంతోమందిని తన కొమ్మలకింద అక్కున చేర్చుకొని కాపాడింది రావిచెట్టు.

మిర్యాలగూడ-కోదాడ జాతీయ రహదారిపై ఉండటంతో,రోడ్డు వెడల్పులో భాగంగా ఈ రావిచెట్టును తొలగించే యత్నాలు చేసినప్పుడు అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఈ మహా వృక్షాన్ని నరకొద్దని ఉద్యమం కూడా చేసిన సంగతి తెలిసిందే.కానీ,జాతీయ రహదారిపై మధ్యలో ఉండటం వల్ల తప్పనిసరి తొలగించాల్సిన పరిస్థితి రావడంతో ఇన్నేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన రావి చెట్టును గురువారం తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు.

గతంలో కొంతమంది ప్రకృతి ప్రేమికులు,అఖిలపక్ష నేతలు ఈ చెట్టును కాపాడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఇక్కడి నుండి తీసి వేరే దగ్గర నాటాలనే ఆలోచన కూడా చేశారు.

అయినా సాధ్యపడలేదు.ఎన్ని ప్రయత్నాలు చేసినా చెట్టును కాపాడలేక పోయామని,ఈ చెట్టు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని,దాన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదని,ఇప్పుడు చెట్టు నరుకుతుంటే ఏమి చేయలేక చూస్తూ బాధపడుతున్నారు నేరేడుచర్ల ప్రజలు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

మళ్ళీ అలాంటి చెట్టు పుట్టాలంటే ఇన్నేళ్లు పడుతుందోనని చెట్టు కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Advertisement

Latest Suryapet News