కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే ఎన్నో భాషల్లో తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల పాటలు పాడిన ఈయన గాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని చివరి శ్వాస వరకు పాటపాడుతూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.ఈ క్రమంలోనే ఆయన మరణవార్త తెలిసిన ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
కేకే మరణించడంతో ఎంతో మంది ఆయన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకోవడం కోసం పెద్ద ఎత్తున వెతకడం మొదలుపెట్టారు.కేకే తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతిలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తన భార్య స్ఫూర్తితో తాను ఇండస్ట్రీలోకి గాయకుడిగా ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే కేకే సింగర్ కాక ముందు ఏం చేసేవారు అనే విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.

కేకే గాయకుడు కాకముందు ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి.ఇలా అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన జీవితంలో ముందుకు నడవడం కోసం ఆయన ముంబైలో సేల్స్ మెన్ గా పనిచేసేవారు.ఈ విధంగా సేల్స్ మెన్ గా పనిచేస్తూ తన ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో కృషి చేశారు.
ఇక తాను గాయకుడు కావడానికి తన భార్య జ్యోతిలక్ష్మి ప్రోత్సాహం ఎంతగానో ఉందని చెప్పాలి.తన భార్య ప్రోత్సాహంతోనే ఆయన సేల్స్ మెన్ ఉద్యోగం మానేసి గాయకుడిగా అవకాశాలకోసం ప్రయత్నాలు చేశారు.
చాలా ప్రయత్నాల తర్వాత 1994 సంవత్సరంలో వ్యాపార ప్రకటనలకు జింగిల్స్ పాడే అవకాశం లభించింది. అలా అవకాశాలను అందుకొని నేడు దేశం గర్వించే గాయకుడిగా పేరు సంపాదించుకున్నారు.







