రాహుల్ గాంధీ పై అనర్హత వేటును నిరసిస్తూ పోస్ట్ కార్డుతో నిరసన

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై పార్లమెంట్ లో ఎంపీ గా అనర్హత వేటు వేసిన అంశం పై జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డ్ లతో ర్యాలీగా వెళ్లి పోస్ట్ కార్యాలయం ముందు నిరసన తేలియజేసి ప్రదాన మంత్రి( Prime Minister )నివాసానికి పోస్ట్ చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు.

ఈ సందర్బంగా రెడ్దిమల్ల భాను మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం( BJP ) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని,ప్రధాన మంత్రి పేడుతున్న అక్రమ కేసులకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయపడబోరని తెలిపారు.

రాహుల్ గాంధీ అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తి కాదని బిజేపి కావాలనే ఆయన పై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీ పోరాటానికి అన్ని పార్టీల నేతలు దేశ ప్రజలు మద్దతుగా నిలిచారని ఇక బిజేపి ప్రభుత్వం మోడి ఆటలు ఇక సాగవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిందం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అకేని సతీష్, జడల రాజు, సాల్మన్ రాజు, కొండ శేఖర్, విజయ్ కుమార్, వినయ్ కుమార్, రకం మనోహర్ , భూమేష్, భూపాల్ రెడ్డి, లచ్చయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్.. POCSO చట్టం క్రింద కేసు నమోదు
Advertisement

Latest Rajanna Sircilla News