ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై అదనపు కలెక్టర్లు బి.

సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్ లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు.

అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 34 ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు టి.శ్రీనివాస రావు, పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Advertisement
How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained

Latest Rajanna Sircilla News