Harish Rao : ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలి..: హరీశ్ రావు

ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.కృష్ణా జలాలను పున: పంపిణీ చేయాలని ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే కేంద్రానికి లేఖలు రాశామన్నారు.

సంవత్సరమైనా కేంద్రం పరిష్కరించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ కు రెఫర్ చేస్తామని చెప్పారన్నారు.కేంద్రంపై గౌరవంతో కేసును విత్ డ్రా చేసుకున్నామని తెలిపారు.2023 అక్టోబర్ 6న ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని కోరాలని వెల్లడించారు.

Project Wise Allocation Of Water Should Be Done Harish Rao

ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఆయన తీర్మానంలో ఈ అంశాన్ని పొందుపర్చాలని పేర్కొన్నారు.అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్( Rayalaseema Lift Irrigation ) పై కేసీఆర్( KCR ) అభ్యంతరం వ్యక్తం చేశారని, ప్రాజెక్టుకు టెండర్లు పిలవకముందే కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు.కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని విమర్శించారు.

ఈక్రమంలోనే గత ప్రభుత్వం తప్పిదాలు అని కాకుండా తీర్మానం చేస్తే మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Project Wise Allocation Of Water Should Be Done Harish Rao-Harish Rao : ప్�
అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!

తాజా వార్తలు