అరుదైన గౌరవం అందుకున్న ప్రభాస్ ఆది పురుష్... సంతోషంలో చిత్ర బృందం!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఆది పురుష్( Adipurush ).

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా నటి కృతిసనన్ ( Kritisanan ) సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.ఈ క్రమంలోని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదలయ్యాయి.

ఈ పోస్టర్లు చూసినటువంటి అభిమానులు తీవ్రస్థాయిలో చిత్ర బృందం పై విమర్శలు చేశారు.హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే రాముడి రూపురేఖలని మార్చేసారంటూ ఈ పోస్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇలా విడుదలకు ముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందోనని ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది.

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ( Tribeca Film Festival )లో ఆది పురుష్ సినిమా ప్రదర్శనకు ఎంపికైంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ ( Om Rauth )సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.సంతోషానికి మించిన విషయం 2023 జూన్ 13వ తేదీ ఆది పురుష్ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది.

ఈ సినిమాని ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు ఆది పురుష్ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు.ఈ వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు