ప్రముఖ ఓటీటీలో రవితేజ ధమాకా... స్ట్రీమింగ్ ఎప్పుడు... ఎక్కడంటే?

మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా.

శ్రీ లీల రవితేజ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పరుగులు పెట్టింది.ఇక ఈ సినిమా 100 కోట్ల క్లబ్ చేరి భారీ లాభాలను అందుకుందని చెప్పాలి.

ఇక ఈ సినిమా థియేటర్లో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా ఓటీటీ పార్టనర్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది.

Popular Ott Ravi Teja Dhamaka Streaming When Where , Popular Ott , Ravi Teja , D

రవితేజ ధమాకా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.ఈ క్రమంలోనే ఈ సినిమాని జనవరి 22వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది.అయితే త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Advertisement
Popular Ott Ravi Teja Dhamaka Streaming When Where , Popular OTT , Ravi Teja , D

రవితేజ క్రాక్ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటించారు.అయితే ఈయన నటించిన కిలాడి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు తీవ్ర నిరాశపరిచాయి.

Popular Ott Ravi Teja Dhamaka Streaming When Where , Popular Ott , Ravi Teja , D

ఈ క్రమంలోనే ధమాకా వంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత రవితేజ గెస్ట్ రోల్ చేసినటువంటి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కాకుండా ఈయన టైగర్ నాగేశ్వరరావు రావణాసుర వంటి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు